ETV Bharat / state

గ్యాస్​ లీకై ఇల్లు దగ్ధం.. 12 లక్షల ఆస్తి నష్టం - గుంజేపల్లెలో గ్యాస్​ లీక్

ఓ ఇంట్లో గ్యాస్​ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో... పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లెలో జరిగింది.

House burns due to gas leak at gunjepalli
గ్యాస్​ లీకై ఇళ్లు దగ్ధం
author img

By

Published : Feb 6, 2021, 12:12 PM IST

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లెలో గ్యాస్ లీకై ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన నారాయణస్వామి ఇంటిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఇంట్లో వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రూ 12 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: పల్లె సారధి విలువల వారధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.