అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని తమ్మిడేపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రత్నమ్మ అనే మహిళకు చెందిన ఇంటి పై కప్పులో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. అప్రమత్తమైన మహిళ బయటకు వచ్చి కేకలు వేయగా.. స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించారు.
అప్పటికే మంటలు అదుపులోకి రాకపోవడం వల్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈఘటనలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: