ETV Bharat / state

కేసు నమోదైన 90 రోజుల తర్వాత.. డీఫాల్ట్​ బెయిల్​కు అవకాశం.. కానీ: హైకోర్టు

HC ON MLC ANANTHABABU PETITION : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్​ పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. క్రిమినల్​ కేసు నమోదైన 90 రోజుల తర్వాత డీఫాల్ట్‌ బెయిల్‌కు అవకాశం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

HC ON MLC ANANTHABABU PETITION
HC ON MLC ANANTHABABU PETITION
author img

By

Published : Nov 14, 2022, 4:51 PM IST

MLC ANANTHABABU PETITION : ​డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్​ పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే కేసు నమోదైన 90 రోజుల తర్వాత డీఫాల్ట్‌ బెయిల్‌కు అవకాశం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. 80 రోజుల తర్వాత ఛార్జిషీట్‌ వేసి వెనక్కి తీసుకున్నారన్న అనంతబాబు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ కేసులో అది సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉందని తెలిపింది. అనంతబాబు పిటిషన్‌పై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం, సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులకు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను డిసెంబర్​ 12కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.