దేశంలోనే ప్రసిద్ధి గాంచిన రైల్వేస్టేషన్ లలో అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ ఒకటి. అలాంటి స్టేషన్ లో అధికారుల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తేలికపాటి వర్షానికే స్టేషన్ ఆవరణమంతా చిత్తడిగా మారుతోంది. కేంద్రం ఆకర్షణీయమైన రైల్వే స్టేషన్లను నిర్మించడంలో భాగంగా గుంతకల్లు రైల్వే స్టేషన్ ను ఎంపిక చేసింది. మొదటి విడతగా స్టేషన్ ముందు భాగంలో ప్రయాణికుల కాలక్షేపం కోసం పార్కులు, వాహనాల కోసం పార్కింగ్లను ఏర్పాటు చేసింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్టేషన్ ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. కోట్లాది రుపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన మోడల్ రైల్వే స్టేషన్ ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం జరుగుతూనే ఉంది. అధికారులు ముందుచూపు లేకుండా డబ్బులు ఖర్చు పెట్టి సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడానికి నిదర్శనంగా నిర్మాణం కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు చేపట్టి .. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా కట్టడాలు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి.