ETV Bharat / state

అనంత తడిసింది.. రైతుల్లో ఆశలు పెంచింది - అనంత తడిసింది

అనంతపురం జిల్లాలో ఈసారి కరవుతీరా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు రైతులను కొంత నష్టపరిచినా... ప్రస్తుతం పుష్కలంగా వానలు పడుతున్నాయి.

heavy rain
author img

By

Published : Sep 25, 2019, 8:35 PM IST

అనంత తడిసింది - రైతుల్లో ఆశలు రేపింది

ఎప్పుడూ కరవుతో అల్లాడే అనంతపురం జిల్లా.... ఈసారి భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్‌లో ముఖం చాటేసినా... కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలకు ప్రాణం పోశాయి. ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన అన్నదాతలు... రబీలో శనగపప్పు, చిరుధాన్యాలు సాగుచేసి.. కొంతవరకైనా నష్టాలను పూడ్చుకోవచ్చనే ఆశతో ఉన్నారు. దశాబ్దాలుగా చుక్కనీరు కనిపించని చెరువులు సైతం ఈసారి నిండు కుండలను తలిపిస్తున్నాయి. చెక్ డ్యాంల్లోనూ భారీగా నీరు ఉండడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. రబీ సాగుకు ఈ వర్షాలు చాలా అనుకూలంగా ఉంటాయని అన్నదాతలు ఆనందిస్తున్నారు.

జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నదుల్లోకి భారీగా నీరు చేరింది. గుండ్లపల్లి, వేదవతి, పెన్నా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కళ్యాణదుర్గంలో అత్యధికంగా వర్షాలు పడ్డాయని అధికారులు తెలిపారు. 63 మండలాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు వివరించారు. జిల్లాలో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో ఉద్యాన పంటల రైతుల్లో ఆనందం నెలకొంది. భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Intro:ap_vja_45_25_raitu_barosa_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. రైతు భరోసా పథకం లో ప్రతి రైతు కుటుంబానికి లబ్ధి చేకూరేలా ప్రత్యేకమైన యాప్ ద్వారా అన్ని వివరాలు నమోదు చేస్తున్నట్లు ముసునూరు మండలం వ్యవసాయ అధికారి పి శివ శంకర్ తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో నేడు నిర్వహించిన రైతు భరోసా గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు క్షేమం దృష్ట్యా ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా అని చెప్పారు ఈ పథకంలో లబ్ధి పొందే ప్రతి రైతుకు 12,500 రూపాయల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయని అన్నారు ఇది ముందుగా రైతు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న నగదు అని తెలియజేశారు గ్రామాల్లో 235 మంది రైతుల జాబితా సిద్ధమైందని గ్రామ సభలో లబ్ధిదారులు అయిన రైతుల పేర్లు చదివి వారికి బ్యాంకు ద్వారా నగదు అందించడం జరుగుతుందన్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ భూమి వివరాలు తెలిపితే పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ బుక్ రైతు ఫోటోలు అగ్రిమెంటు జాబ్ కార్డ్ ద్రవీకరణ పత్రాలు అన్ని కంప్యూటర్ కి ఎక్కించి ఉన్నత అధికారుల పరిశీలన అనంతరం వైఎస్సార్ రైతు పథకం కింద నగదు అందజేయడం జరుగుతుందన్నారు గతంలో లబ్ధి పొందిన రైతులు సైతం కొత్తగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. బైట్స్. 1) శివశంకర్ ముసునూరు మండలం వ్యవసాయ అధికారి. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు పిన్కోడ్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:రైతు భరోసా పథకం

Conclusion:రైతు భరోసా పథకం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.