అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోకజవర్గ వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం వద్ద వాగులు, వంకలు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి.150 ఎకరాల్లో వరి, మిరప పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరాయి. రహదారులు చెరువులను, వంకలను తలపించాయి. ఉరవకొండ-మల్లాపురం రోడ్డు కోతకు గురి అయ్యింది. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పరవళ్లు తొక్కుతున్న చిత్రావతి నది
జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది పొంగిపొర్లుతోంది. ఈ నది కారణంగా ధర్మవరం చెరువుకు భారీగా నీరు చేరుతోంది. చిత్రావతి పొంగి ప్రవహిస్తుండటంతో... సమీప గ్రామాల భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉద్ధృతంగా వరద ప్రవాహం.. ప్రాజెక్టులకు జలకళ