ఇవాళ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆర్టీజీఎస్ వెల్లడించింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్ష కురిసే అవకాశం ఉంది.
రేపు ఉత్తరాంధ్ర , ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన ఉంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది. ఎల్లుండి ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన ఉన్నట్లు ఆర్టీజీఎస్ తెలిపింది. ఎల్లుండి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన ఉంది. కృష్ణా, గుంటూరు ప్రకాశం, నెల్లూరు, కడప కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.