రాష్ట్రంలో పలు చోట్ల తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అడ్డుదారులు తొక్కుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఎనిమిది వ్యక్తులు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని ఆటోలో తీసుకువస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.3లక్షల పదివేలు విలువ చేసే మద్యం సీసాలతో పాటుగా ఆటో, స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి