అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సంఘటన అందరినీ కలిచివేసింది. శింగనమల మండలం ఈస్ట్ నరసాపురానికి చెందిన దుర్గమ్మ(75) అనే వృద్ధురాలు ఇవాళ ఇంటివద్ద మరణించింది. దుర్గమ్మ కుమార్తె కర్నూలు జిల్లా కొత్తకోటలో ఉంటుంది. నిన్నటి వరకు కూతురు వద్ద ఉన్న దుర్గమ్మ ఇవాళ పింఛన్ తీసుకునేందుకు గ్రామానికి వచ్చింది. ఇంటి వద్దే పింఛన్ ఇస్తారన్న ఉద్దేశంతో వేచి ఉంది. ఇంటి బయట ఉన్న ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురై మరణించింది. గ్రామస్తులు గుర్తించినా.. ఎవరూ దగ్గరికి వెళ్లలేదు. దుర్గమ్మ కర్నూలు నుంచి రావటంతో అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతదేహం వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు.
ఇదీ చదవండి