అనంతపురం జిల్లా తలుపుల మండలం దామపల్లి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలోని టన్నెల్ పనులు పునః ప్రారంభమయ్యాయి. పదేళ్ల నుంచి కొనసాగుతున్న టన్నెల్ పనులు వివిధ కారణాలతో పలుమార్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తాజాగా వీటిని కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి ప్రారంభించారు.
ఈ పనులు త్వరగా పూర్తిచేసి, ప్రధాన కాలువ పనులు వేగవంతం చేస్తామన్నారు. మరో 3 నెలల్లో హంద్రీనీవా ప్రధాన కాలువకు కృష్ణా జలాలను తీసుకొస్తామని ఎమ్మెల్యే అన్నారు.
ఇవీ చదవండి....