handloom weavers struggles: ఓ వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ ప్రస్తుతం మూసివేత దిశగా సాగుతోంది. కరోనా సమయంలో చేసిన అప్పులు తీర్చక ముందే చీరల తయారీకి వాడే ముడి పట్టు ధరలు ఆకాశాన్నంటాయి. ఆరు నెలల కిందట రూ.2,200 ఉన్న ధర ప్రస్తుతం రూ.7 వేలకు చేరింది. ఇంత ధర పెట్టి కొని నేసినా గిట్టుబాటు కాకపోవడంతో నేతన్నలు పని ఆపేస్తున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం, హిందూపురంలో వేల సంఖ్యలో మగ్గాలు ఉండగా జిల్లావ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు. పెరుగుతున్న ధరకు అనుగుణంగా చీరల ధరలు పెరగటం లేదని, దీంతో భారీగా నష్టపోతున్నట్లు ధర్మవరం పట్టణానికి చెందిన నాగార్జున ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్ల కిందట 15 మగ్గాలతో పని చేయగా.. ప్రస్తుతం నాలుగే నడిపిస్తున్నామని, మిగిలినవి వృథాగా ఉంచామన్నారు. దీనివల్ల 11 మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. మరో వ్యక్తి తన వద్ద 200 మగ్గాలు ఉండగా ప్రస్తుతం 40 మాత్రమే నడిపిస్తున్నట్లు వివరించారు. ధర్మవరంలో గతంలో 50 వేల మగ్గాలు ఉండగా ప్రస్తుతం అవి 10 వేలకు చేరుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇదీ చదవండి:
సినిమా పరిశ్రమ విశాఖ రావాలి.. తెలంగాణకన్నా ఏపీ సహకారమే ఎక్కువ: జగన్