అనంతపురం జిల్లా రొద్దం మండలంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న రూ.5000 పెన్షన్... 35 మందికి నిలిచిపోయింది. ఈ విషయంపై బాధితులతో కలిసి.. పెనుకొండ - పావగడ ప్రధాన రహదారిపై ఉన్న ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు.
వీరికి ఆ పార్టీ హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి మద్దతు తెలిపారు. ఇంత జరుగుతున్నా... అధికారులు ఎవరూ వీరిని పట్టించుకోకపోవడం శోచనీయమని నాయకులు అన్నారు. దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారంతా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Viveka murder case: వివేకా హత్యకేసు.. విజయవాడ సీబీఐ కోర్టుకు సునీల్