ETV Bharat / state

TRAINS CANCEL: ఆ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు.. - రైళ్లు రద్దు వార్తలు

దక్షిణ మధ్య రైల్వే జోన్​ లోని ఆ డివిజన్​ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. రైల్వే డబ్లింగ్, సిగ్నలింగ్ పనులు చేపట్టడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరి కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నామని అధికారులు వెల్లడించారు.

trains
trains
author img

By

Published : Oct 7, 2021, 12:15 PM IST

దక్షిణ మధ్య రైల్వే జోన్​లోని గుంతకల్లు డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంతకల్లు డివిజన్ మేనేజర్ వెంకట రమణా రెడ్డి తెలిపారు. హుబ్లీ జోన్, బెంగళూర్ డివిజన్ పరిధిలోని హిందూపురం రైల్వే స్టేషన్​తో పాటు మరికొన్ని స్టేషన్​లలో డబుల్ లైన్ నిర్మాణ పనులు, సిగ్నలింగ్ పనుల కారణంగా.. ఆయా మార్గాల్లో నడిచే రైళ్లను ఇప్పటికే రద్దు చేశామని చెప్పారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని రైళ్లను దారి మళ్లించి, బళ్లారి-కడప మీదుగా నడుపుతున్నట్లు వెల్లడించారు.

ప్యాసింజర్ రైళ్లు..
ప్యాసింజర్ రైళ్లను ఈనెల 6వ తేదీ నుంచి 46 రోజులపాటు దారిమళ్లించనున్నట్టు తెలిపారు. హిందూపురం స్టేషన్ మీదుగా కాకుండా వేరే మార్గంలో నడుపుతున్నామని వెంకట రమణా రెడ్డి తెలిపారు. గుంతకల్లు-హిందూపురం, హిందూపురం-గుంతకల్లు నడిచే ప్యాసింజర్ రైళ్లను నవంబర్ 20 వరకు రద్దు చేశామని వెల్లడించారు.

ఎక్స్​ప్రెస్ రైళ్లు..
బెంగళూరు కంటోన్మెంట్ -హిందూపురం, హిందూపురం-బెంగళూరు కంటోన్మెంట్, యశ్వంత్​పూర్-హిందూపురం, హిందూపురం-యశ్వంత్​పూర్, మార్గాలలో నడిచే పలు ఎక్స్​ప్రెస్ రైళ్లను కూడా దారి మళ్లించి నడుపుతున్నట్టు చెప్పారు. హిందూపురం మీదుగా నడిచే ఎక్స్​ప్రెస్ రైళ్లను.. నవంబర్ 8 నుంచి రద్దు చేస్తున్నామని తెలిపారు. రెండు నుంచి నాలుగు రోజులపాటు ఈ రైళ్లు నిలిచిపోతాయని చెప్పారు. ఈ మార్గాల్లో నడిచే మరికొన్ని రైళ్లను.. బళ్లారి-కడప మార్గాలకు మళ్లించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని డీఆర్ఎం వెంకట రమణా రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: Student Suicide : రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.