ETV Bharat / state

'అతిథి ఉపాధాయులకు ఉదోగ భద్రత కల్పించాలి' - ఉదోగ భద్రత కల్పించాలనిఅతిథి ఉపాధాయుల ధర్నా

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్న అతిథి ఉపాధాయులకు ఉదోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో అతిథి ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. వారి డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.

Guest teachers should be provided with job security says teachers association
అతిథి ఉపాధాయులకు ఉదోగ భద్రత కల్పించాలి
author img

By

Published : Aug 17, 2020, 5:31 PM IST

భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్న అతిథి ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మహాత్మ జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాల ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. అనంతపురంలోని సంగమేశ్వర సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.

అతిథి ఉపాధ్యాయులుగా చేస్తున్న వారిని సీఆర్టీలుగా గుర్తించాలని కోరారు. ఏప్రిల్ నెల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చేసిన పాదయాత్రలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి, జీవో నెంబర్ 23 రద్దు చేయాలని కోరారు. వారి డిమాండ్లను నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

చుట్టుముట్టిన గోదారమ్మ... భయాందోళనలో లంక గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.