నిన్న మొన్నటి వరకు వేరుశనగ విత్తనాల కోసం నిరసనలు, ధర్నాలతో కొనసాగిన రైతుల పాట్లు... ప్రాణాలు హరించే స్థాయికి చేరుకున్నాయి. ఈ మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం మార్కెట్ యార్డులో విషాదం చోటు చేసుకుంది. విత్తనాల కోసం వచ్చిన రైతు ఈశ్వరప్ప.. క్యూ లైన్లో పడిగాల్పులు భరించలేక మృతి చెందాడు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డ ఈశ్వరప్ప... నీరసించిపోయాడు. అలాగే కష్టపడి టోకెన్లు తీసుకున్నాడు. బయటకు వచ్చిన వెంటనే తోటి రైతులతో కలిసి టీ తాగుతుండగా కుప్పకూలి కింద పడిపోయాడు. వెంటనే గ్రామానికి చెందిన రైతులు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుడిని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామస్తుడిగా గుర్తించారు.
ఇదీ చదవండి..