అనంతపురం జిల్లా చిలమత్తూరులో వేరు శనగ విత్తనాల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి జిల్లాలో వేరుశెనగ విత్తన పంపిణీ జరుగుతోంది... అయితే సర్వర్ల మొరాయింపు వల్ల చాలా చోట్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ చిలమత్తూరులోనూ ఈ సమస్యే తలెత్తింది. ఉదయం నుంచి రైతులు క్యూలైన్లో నిల్చున్నా సర్వర్ల సమస్యతో విత్తన పంపిణీ ముందుకు సాగలేదు. దీంతో విసిగిపోయిన రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు.
ఇదీ చదవండి