ETV Bharat / state

గోశాలలోని ఆవులకూ రక్షణ కరువే..!

ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలోని గోశాలలో ఉన్న ఆవులకు రక్షణ కరువైంది. తాజాగా రెండు గోవులను కబేలాకు తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

author img

By

Published : Aug 4, 2019, 3:14 PM IST

గోశాల
గోశాలలోని ఆవులకు రక్షణ కరువేనా...

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో సుమారు 100 గోవులు సంరక్షించబడుతున్నాయి. పశువుల కాపరికి మాయమాటలు చెప్పి 2 గోవులను కబేళాలకు తీసుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారులు వెంటనే స్పందిచటంతో గోవులు సురక్షితంగా కబేళా నుంచి బయటపడ్డాయి. గోశాలలో వంద ఆవులు, వాటికి దూడలు ఉన్నాయి. వాటి నిర్వహణ భారం కావటం.. తగిన స్థలం లేకపోవటంతో ఎద్దులను రైతులకు ఇచ్చేందుకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులు తమకు కావాల్సిన పశువుల కోసం పట్టాదారు పాసు పుస్తకం, వారి చిరునామా తీసుకుని ఇస్తున్నారు. ఆవుల కాపరి గోపాల్​కు గ్రామానికి చెందిన మణి, దావుద్ అనే ఇరువురు ఆలయ అధికారికి చెప్పామంటూ.. రెండు గోవులను కావాలని కోరటంతో అధికారులకు తెలపకుండ వాటిని అప్పగించాడు. పశువులను కర్నూలు జిల్లా మద్దికెర గ్రామంలోని కబేలదారులకు కొంత సొమ్ముకు విక్రయించారు. గోశాలలో ఉన్న పశువులకు ఎర్రచందనం, బొట్టు పెడుతూ ఉంటారు. మద్దికెర గ్రామస్థులు వాటిని గుర్తించి... ఆలయ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు వాటిని వెంటనే వెనక్కు తీసుకువచ్చారు. గోశాల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. కబేళాకు అమ్ముకున్న దావూద్, మణిపై కసాపురం పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. కాపరిని సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి.

తెల్లకాగితాన్నైనా... కళాఖండంలా మార్చేయగలడు

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_A tp_46_17_Somu_Verraju_On_Tdp_AVB_C8

Body:రైతులకు దక్కాల్సిన ఉత్సాహాన్ని దళారుల పాలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వ్యవసాయం లాభసాటి గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించినట్లు ఆయన తెలిపారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వెలుగు సంఘాల ద్వారా కొనుగోలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేసింది చేసిందన్నారు. అన్నదాతకు ప్రయోజనాన్ని కలిగించే ఈ విధానాన్ని చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీతో తెదేపా పొత్తును ఉపసంహరించుకోవడంతో నే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని సోము వీర్రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం నామమాత్రమేనని, భాజపా తో లబ్ధి పొందిన చంద్రబాబు తరువాత ద్వంద్వ వైఖరిని ప్రజలకు వివరిస్తూ తెదేపాను ఓడించడంలో అవుతున్నట్లు ఆయన తెలిపారు. మే 23 తర్వాత 37 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం కోల్పోనుందని భాజపా నాయకులు అన్నారు

Conclusion:బైట్
సోము వీర్రాజు, భాజపా ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.