Godadevi Ranganatha Swamy Kalyanotsavam: అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణోత్సవం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో.. భోగి పండగ పురస్కరించుకొని గోదాదేవి రంగనాథ స్వాముల కల్యాణోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రాయదుర్గం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు, వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు పాలాక్షి రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు శ్రీవారిని దర్శించుకుని గోదాదేవి కల్యాణోత్సవంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెళ్లికాని యువతులు శ్రీవారి కల్యాణోత్సవం కనులారా దర్శించుకుంటే త్వరగా పెళ్లిళ్లు అవుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా భోగి పండగ రోజు గోదాదేవి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్థానిక భక్తులతో పాటు, అనంతపురం జిల్లా, కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుని.. తమ మొక్కులు తీర్చుకున్నారు. రాయదుర్గం దేవదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులకు తాగునీరు, తీర్థ ప్రసాదములు, అన్న సంతర్పణ కార్యక్రమాలు చేపట్టారు.
నంద్యాలలో శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. నంద్యాల సంజీవనగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కల్యాణానికి భక్తులు హాజరై తిలకించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటం నిర్వహించారు.
ఇవీ చదవండి: