ETV Bharat / state

తాడిపత్రిలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్ - అనంతపురం జిలా తాడిపత్రిలో గంజాయి ముఠా అరెస్ట్

నిషేధిత గంజాయి తరలిస్తున్న ముఠాను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సమారు రూ.7.60 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తాడిపత్రి డీఎస్పీ కె.చైతన్య వెల్లడించారు.

ganja sellers arrested
తాడిపత్రిలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
author img

By

Published : Dec 7, 2020, 11:00 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్టీసీ బ​స్టాండ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ ఎర్టీగా కారు పోలీసులను చూసి ఆగకుండా వెళ్లగా వెంబడించి పట్టుకొని సోదాలు చేశారు. 24 కేజీల గంజాయి, 2 కేజీల గంజాయి నూనెను స్వాధీనం చేసుకుని నిందితుడిని ఆరెస్ట్ చేశారు. వీటి విలువ సమారు రూ.7.60 లక్షలు ఉంటుందని తాడిపత్రి డీఎస్పీ కె.చైతన్య తెలిపారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం లింగంపల్లికి చెందిన ముత్యాల శేషుకుమార్, అతని భార్య ముత్యాల శ్యామల, కొవ్వూరుకు చెందిన పల్లి వెంకట రవితేజ, నెల్లూరుకు చెందిన ఒట్టికల మాధవరావులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. విశాఖ మన్యంలోంచి గంజాయిని కొనుగోలు చేసి కారులో కుటుంబ సభ్యుల మాదిరిగా రాజమండ్రి, బెంగుళూరు, మదురై తరితర ప్రాంతాలకు తిరుగుతూ విక్రయించేవారు. నిందితులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి:

నమ్మించి మోసం చేసిన ముగ్గురు మహిళలు..బాధితుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.