అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామంలో శంకరప్ప అనే యువకుడు బెంగళూరు నగరంలోని ఓ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో మాటలు రాక తన స్వగ్రామంలో ఇంటికే పరిమితమయ్యాడు. 2005వ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు విషయం తెలుసుకుని శంకరప్పకు, కుటుంబ సభ్యులకు ధైర్యం నింపి రూ.17500 అందించారు.
ఇదీ చూడండి