ETV Bharat / state

Free Medical Tests: 'ఆరోగ్యంగా ఉన్నారా'.. ఉచితంగా షుగర్‌, బీపీ పరీక్షలు చేస్తున్న యువ వైద్యుడు - Dr Rajeev Reddy Anantapur

Dr Rajeev Reddy Free Sugar and BP Tests: ప్రజారోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేల కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నాయి. వ్యాధి ముదిరాక ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నాయి. అయితే ముందే జాగ్రత్త పడేందుకు ఏం చేయాలనే విషయంపై మాత్రం.. ఏ ప్రభుత్వమూ దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ అంశాన్ని గుర్తించిన అనంతపురానికి చెందిన ఓ యువ వైద్యుడు.. షుగర్‌, బీపీలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. మేలని భావించారు. అందుకే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అంటూ ప్రశ్నిస్తూ.. ఉచిత వైద్య సేవలు అందిస్తూ.. అందరినీ ఆలోచింపజేస్తున్నారు.

Dr Rajeev Reddy Free Sugar and BP Tests
'నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా' అంటున్న యువ వైద్యుడు.. ఉచితంగా షుగర్‌, బీపీ పరీక్షలు
author img

By

Published : Jun 15, 2023, 10:24 PM IST

'నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా' అంటున్న యువ వైద్యుడు.. ఉచితంగా షుగర్‌, బీపీ పరీక్షలు

Dr Rajeev Reddy Free Sugar and BP Tests: ఈ రోజుల్లో ముందుగా జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారే వ్యాధుల్లో షుగర్, బీపీ కీలకంగా ఉన్నాయి. వీటిని ముందుగా గుర్తించక, గుర్తించినా అదుపుచేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోక.. చాలా మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలని భావించిన అనంతపురానికి చెందిన డాక్టర్‌ రాజీవ్ రెడ్డి …నగరంలో చక్కెరవ్యాధి, రక్తపోటు వ్యాధుల ఉచిత కౌన్సెలింగ్ పరీక్షలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అంటూ ప్రత్యేక సంచార వాహనం ఏర్పాటు చేశారు. షుగర్, బీపీ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వేలమందిని పరీక్షించారు. వందలాది రోగులను గుర్తించారు.

వ్యాధులకు ఉచిత కౌన్సిలింగ్ పరీక్షలు.. ప్రాణాలు తీసే అనారోగ్య సమస్య వచ్చాక వైద్యం చేయించటం కంటే, ముందుగానే వ్యాధిని గుర్తించి అదుపు చేస్తే ప్రాణాపాయం తప్పించవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించటం లేదు. ప్రస్తుతం సమాజంలో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారిన వ్యాధుల్లో షుగర్, బీపీలు కీలకంగా ఉన్నాయి. ఈ రెండిటిని ముందుగా గుర్తించకపోవటమో.. ఒకవేళ గుర్తించినా వాటిని అదుపుచేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ రెండు వ్యాధులను ముందుగానే గుర్తించే పరీక్షలు ఎక్కడా నిర్వహించక పోవటం వల్ల, రోగుల కోసం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన అనంతపురానికి చెందిన యువ వైద్యుడు డా రాజీవ్ రెడ్డి నగరంలో చక్కెరవ్యాధి, రక్తపోటు వ్యాధుల ఉచిత కౌన్సిలింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా.. అంటూ డా రాజీవ్ రెడ్డి ప్రత్యేక సంచార వాహనం ఏర్పాటు చేసి షుగర్, బీపీ వ్యాధుల నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డా రాజీవ్ రెడ్డి ఏడాదిన్నర పాటు అనంతపురం ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యుడిగా పనిచేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో బీపీ, షుగర్ వ్యాధులతో వస్తున్న వారి రోగ చరిత్ర గురించి తెలుసుకున్న డా. రాజీవ్ ఈ రెండు పరీక్షలను తరుచూ చేసుకుంటే ప్రాణాలను తీసే వ్యాధులను జయించవచ్చని గుర్తించారు. దీంతో ఆయన నగరంలో ప్రత్యేకంగా ఓ సంచార వాహనాన్ని ఏర్పాటు చేసి అనంతపురం నగరంలోని పలు కాలనీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య బృందం ద్వారా బీపీ, షుగర్ వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆరువేల మందికి పైగా పరీక్షలు.. ఇలా ఆరువేల మందికి నిర్వహించిన పరీక్షల్లో 1800 వరకు కొత్తగా వ్యాధి గ్రస్తులను గుర్తించారు. రోజూ 150 మందికి పైగా రోగులకు ఉచితంగానే ఈ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నగర ప్రజలు, ముఖ్యంగా దారివెంట వెళ్లేవారు సైతం బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ తరహాలోనే ప్రభుత్వం కూడా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించే నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలను ముందస్తుగా అనారోగ్య ప్రమాదం నుంచి కాపాడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.