కాసుల కక్కుర్తితో వ్యవసాయ శాఖ అధికారులు తెలివిగా రాయితీ విత్తనాన్ని పక్కదారి పట్టించారు. నల్లరేగడి నేలలున్న ప్రాంత రైతులకు వేరుశనగ విత్తనం ఇప్పించి... వాటిని దళారులకు విక్రయించేలా పావులు కదిపారు. వీరి వద్ద తక్కువ ధరకు కొన్న వ్యాపారులు ఆ విత్తనాలను కర్ణాటక తరలిస్తున్నారు. అవసరం ఉన్న స్థానిక రైతులకు అధిక ధరకు విక్రయిస్తున్నారు.
విషయం తెలుసుకున్న వ్యవసాయ, విజిలెన్స్, పోలీసు అధికారులు అక్రమ నిల్వ గుట్టు రట్టు చేస్తున్నారు. విడపనకల్లు మండలం వేల్పమడుగులో ఏకంగా 664 బస్తాలు పట్టుకున్నారు. నిన్న 150 క్వింటాళ్లకుపైగా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు కోటి 7లక్షల రూపాయల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ నిల్వలపైనా కొరడా ఝుళిపిస్తామంటున్న జిల్లా కలెక్టర్...విత్తనాల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.