ETV Bharat / state

"కాంట్రాక్ట్ పనుల కోసమే హెచ్​ఎల్​సీ కాలువకు గండి" - hlc canal

హెచ్​ఎల్​సీ కాలువకు గండి పడడానికి అధికారుల నిర్లక్ష్యం, వైకాపా నాయకుల ధన దాహమే కారణమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. గండి పడి 30 గంటలు దాటినా చర్యలు తీసుకోకపోవటం దారుణమని ధ్వజమెత్తారు.

కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Sep 9, 2019, 12:00 AM IST

హెచ్​ఎల్​సీ కాలువ వద్ద మాజీ మంత్రి

వైకాపా నాయకులు కాంట్రాక్ట్ పనుల కోసమే... నాణ్యంగా ఉన్న హెచ్​ఎల్​సీ కాలవ గట్టును బలహీనపరిచి గండి పడే విధంగా చేశారని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం సమీపంలోని హెచ్ఎల్​సీ కాలువకు పడిన గండిని ఆయన పరిశీలించారు. వరదల ప్రభావంతో టీబీ డ్యాం కు ఒక్కసారిగా ఇన్​ఫ్లో పెరిగి గతంలో ఎన్నడూ లేనివిధంగా హెచ్​ఎల్​సీ రావలసిన 32 టీఎంసీల పూర్వపు మాదిరి వాటా వస్తుందని ఎంతో సంతోషించామన్నారు. ఇంతలోనే... హెచ్ఎల్​సీ కాలువకు నెల లోపు మూడు సార్లు పైపింగ్... ఒకసారి గండి పడి అనేక క్యూసెక్కుల నీరు వృథాగా వాగుల పాలైందన్నారు. కాలువ నీటిపై ఆధార పడిన ఆయకట్టు రైతుల పరిస్థితి కూడా తీవ్ర దుర్భరంగా మారిందన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వైకాపా నాయకులు అని మాజీ మంత్రి ఆరోపించారు.

గండి పడిన ప్రాంతంలో నీటి విడుదల చేయడానికి రెండు రోజుల ముందే వైకాపా నాయకులు తూతూ మంత్రంగా నిర్వహణ పనులు చేసి కాలువ గట్టును బలహీన పరిచారని ఆరోపించారు. ఫలితంగా... నీటి ఒత్తిడికి తట్టుకోలేక గండి పడిందన్నారు. ప్రస్తుతం గండి పడిన ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాలువకు గండి పడి 30 గంటలు దాటిన చర్యలు తీసుకోకపోవటం దారుణమన్నారు. కాంట్రాక్టు పనుల్లో ఆదాయం వస్తోందని వైకాపా నాయకులు ప్రవర్తిస్తున్నట్లుగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా వచ్చి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి భవిష్యత్తులో కాలువకు గండి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాలవ శ్రీనివాసులు కోరారు.

Intro:ap_knl_24_08_uria_abb_AP10058
యాంకర్, కర్నూలు జిల్లాలో యూరియా కొరత కేవలం కృతిమమేనని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు విల్సన్, కమిషనరేట్ కార్యాలయ ఉప సంచాలకులు సుధాకర్ రాజు తెలిపారు. జిల్లాకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లు వారు తెలిపారు. యూరియా కృత్రిమ కొరతకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పలు ఎరువుల దుకాణాలను వారు తనిఖీ చేశారు.
బైట్ 1 విల్సన్, జేడీఏ, కర్నూలు జిల్లా
బైట్ 2 సుధాకర్ రాజు, డి.డి. ఏ. కమిషనరేట్ కార్యాలయం

Body:యూరియా కేటాయింపులు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.