అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం నల్లజోడువారి పల్లికి చెందిన కేశవరెడ్డి అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బోరు బావి వద్ద పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా విద్యుత్ మోటార్ స్టార్టర్ పెట్టెకు కరెంట్ సరఫరా కావడంతో రైతు ప్రమాదానికి గురయ్యారు. విద్యుదాఘాతంతో కేశవరెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. కదిరి గ్రామీణ సీఐ మధు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి