ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. కలెక్టర్ల నుంచి ఆదేశాలు రాలేదంటూ.. చాలా ప్రాంతాల్లో ఇంకా కార్యాలయాల గదులే తెరవలేదు. మరి కొన్ని చోట్ల సాధారణ విధులకు సిబ్బంది హాజరైనా.. అభ్యర్థులనుంచి నామ పత్రాలు తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నారు.
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లాలో నామినేషన్ల స్వీకరణ కోసం అధికారుల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పంచాయతీ కార్యాలయానికి పత్రాలు చేరుకున్నాయి.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు వచ్చిన అభ్యర్థులు వెనక్కి వెళ్తున్నారు. కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాలేదని.. ఆదేశాలు రాగానే ప్రక్రియ చేపడతామని పెనుకొండ ఎంపీడీవో కార్యాలయం అధికారులు తెలిపారు.
హిందూపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్లు తీసుకునేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. నామినేషన్లు సమర్పించాల్సిన గదికి ఇంతవరకు సిబ్బంది తాళం కూడా తీయలేదు. పోలింగ్ కు సంబంధించిన మెటీరియల్ ఆఫీసుకు చేరలేదని సిబ్బంది అంటున్నారు.
చిలమత్తూరు, లేపాక్షిలోనూ ఇదే పరిస్థితి. తూముకుంట మండలంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైకాపా అభ్యర్థి షమీన్ తాజ్‌ను అధికారులు వెనక్కి పంపించారు.
ఇదీ చూడండి: