అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల తండా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు అరటి చెట్లకు నిప్పు పెట్టారు. దాదాపు 3000 అరటిచెట్లు కాలిపోయాయి. అలివేలమ్మ, సునీత అనే రైతులకు చెందిన ఈ అరటి తోటను 9 ఎకరాల్లో సాగు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తోటలో చెట్లకు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానిక రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక వాహనం తోటలోకి వెళ్ళేందుకు వీలు లేనంతగా మంటలు వచ్చిన కారణంగా.. రైతులే మోటర్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ.. మంటలు అదుపులోకి రాలేదు. అక్కడ ఉన్న డ్రిప్పు పైపులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దాదాపు ఐదు లక్షల నష్టం వాటిల్లిందని, పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా జరగడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరారు.
ఇదీ చూడండి:
డాక్టర్లపై పిచ్చివాళ్లు అనే ముద్ర వేస్తోందీ ప్రభుత్వం: అయ్యన్న