అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఓ పట్టు చీరల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 20 లక్షల విలువైన చీరలు కాలి బూడిదయ్యాయి. జనార్దన్ అనే వ్యాపారి.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వెనుక శివ బాలాజీ పట్టు చీరల దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. అప్పటికే దుకాణంలోని చీరలు కాలి బూడిదయ్యాయి. రూ. 20 లక్షలకు పైగా విలువైన పట్టు చీరలు కాలిపోయాయాని యాజమాని జనార్ధన్ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇదీ చూడండి: