అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా సిమెంట్ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. కర్మాగారంలోని ఎల్వన్ యూనిట్లో బొగ్గు వేడి చేసే ప్రాంతంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో... అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అప్రమత్తమైన కర్మాగారం సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ... భారీగా ఆస్తినష్టం జరిగినట్లు కర్మాగార సిబ్బంది తెలిపారు.
ఇదీ చూడండి: FLOODS EFFECT IN AP: భారీ వరదల కారణంగా కోవూరు వద్ద కోతకు గురైన హైవే..!