కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలోని పార్కింగ్‌లో నిలిపిన ఉన్న కారు మంటల్లో దగ్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన భక్తులు కారులో ఉమామహేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చారు. కారును పార్కింగ్‌లో ఉంచి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. వాళ్లు వెళ్లిన కొద్దిసేపటికే వాహనంలోంచి మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కార్తిక మాసం కావడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆలయ ఈవో ప్రసాద్ వెల్లడించారు.
ఇదీ చదవండి: