అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో జేడీఏగా విధులు నిర్వహిస్తున్న హాబీబ్ బాష తమను నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడని అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ ఆరోపించారు. బాధిత మహిళతో పాటు తోటి ఉద్యోగులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
సంవత్సరకాలం నుంచి నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఇతనిపై అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో సీసీ కెమెరాలో చూస్తూ తన కాబిన్లోకి పిలిచి అసభ్యంగా మాట్లాడుతూ నిత్యం హింసకు గురి చేశాడని చెప్పారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు.
ఇదీ చూడండి