Farmers Protest In Anantapur District : అనంతపురం జిల్లాలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు స్థానిక సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కరవు రైతులను, కూలీలను ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
పంట నష్టాన్నిఅంచనా వేయాలన్న ప్రభుత్వం - జంకుతున్న అధికారులు- జగన్ వ్యాఖ్యలే కారణమా?
CPI, Farmers Dharna At collectorate : ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ.. జిల్లాలో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు రాకపోవడంతో వేరుశెనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా నష్టపోయాయని తెలిపారు. జిల్లాలోని మొత్తం 31 మండలాలకు గాను 28 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31న ప్రకటించిందని గుర్తు చేశారు. పంట' నష్టపరిహారం అంచనాల కోసం ఈ నెల 14న జీవో నెంబర్ 5 విడుదల చేసిందన్నారు. ఇందులోని నిబంధనలు రైతులకు ఉపశమనం కలిగించే విధంగా లేకపోగా తీవ్ర నష్టం చేస్తాయని అన్నారు.
కరవు తాండవిస్తున్నా కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చే యత్నం - రైతుల కన్నీరు కనిపించడం లేదా?
DRought mandals Isuue In Anantapur : అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సమయంలో 33 శాతానికి పైగా పంటనష్టం జరిగి ఉండాలని, గరిష్టంగా రెండు హెక్టార్లకు మాత్రమే పరిహారం ఇవ్వాలని, వేరుశెనగ, పత్తి పంటల పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ.45 వేలు అవుతుండగా ప్రస్తుత నిబంధనల వల్ల ఎకరాకు కేవలం రూ.6,800 లు మాత్రమే అందుతుందన్నారు. అలాగే ఇతర పంటల పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా రైతులను ఆదుకునే విధంగా లేదని నిరాశ చెందారు. పంటల సాగుకు బ్యాంకులు పెట్టుబడి రుణం ఇవ్వడానికి నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని, రోజుకు రూ.600 ల వేతనం ఇవ్వాలని కోరారు. పంటసాగుచేసిన కౌలు రైతులకే పంట నష్టపరిహారం అందివ్వాలని, రైతుల బ్యాంకు అప్పులు మాఫి చేయాలని కోరుతున్నామన్నారు.
కడుపు నిండి'నోళ్లకేం' తెలుసు కరవు కష్టం - కొద్దిపాటిదే అన్నట్లుగా జగన్ తీరు
'జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితి ఏర్పడింది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వర్షాలు లేకపోవడంతో వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో మొత్తం 31 మండలాలకు గాను 28 మండలాలు కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పుట్టపర్తికి వచ్చిన ముఖ్యమంత్రి రైతు భరోసా విడుదల చేస్తూ ఈ జిల్లాలో ఈ ఒక్క సంవత్సరమే కరవు వచ్చిందన్నారు. నష్టపోయిన రెండు సంవత్సరాలు ఏ విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చాడో చెప్పాలన్నాలంటూ ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక 386 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతులను పరామర్శించే పరిస్థితి లేదు.' - నాగరాజు సీపీఎం జిల్లా అధ్యక్షులు, చంద్రశేఖర్ రెడ్డి సీపీఎం జిల్లా కార్యదర్శి