లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లాలో రైతన్నలు తీవ్ర ఇబ్బందుులు పడుతున్నారు. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన ప్రేమరాజు అనే రైతు, తనకున్న ఎకరాతో పాటు మరో ఎకరన్నర పొలాన్ని కౌలుకు తీసుకుని, గుమ్మడి పంటను సాగు చేశాడు. పంట చేతికొచ్చినా.. లాక్ డౌన్ కారణంగా అమ్మే అవకాశం లేక కొనేవారు కనిపించక, సుమారు 20 టన్నులకు పైగా దిగుబడి వచ్చిన పంట నష్టపోయినట్టు చెప్పాడు. రూ.2.4 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రేమరాజుతో పాటు.. మిగతా రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: