అనంతపురం జిల్లాలో వర్షపాత లోటు 44 శాతానికి చేరింది. నైరుతి రుతుపవనాలు ఆగమనం తరువాత జూన్ తొలి వారంలో కురిసిన ఓ మోస్తరు వర్షం మినహా ... ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కాడా చినుకు రాలలేదు. వేరుశెనగ విత్తనం సిద్ధం చేసుకున్న రైతులు పురుగుపట్టకుండా కాపాడుకోటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతులు విత్తనంతో పాటు ఎరువులు వేయాలని అప్పులు చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేసే పనిలో వ్యవసాయశాఖ సమాయత్తమవుతోంది. ఆగస్టు తొలి వారం నుంచి అన్నదాతలకు ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదించింది. జిల్లాలోని పలు గ్రామాల్లో పశువులకు నీరు, పశుగ్రాసం లభ్యత కూడా కష్టంగా మారింది.
చినుకు పలకరించక... సాగు నడవక - agriculture
ఓ సారి వర్షం పడగానే ఆశగా వెళ్లి విత్తనాలు కొనుగోలు చేశారు. దుక్కి దున్నడానికి, ఎరువులు కొనడానికి అప్పులు చేశారు. కానీ మబ్బులు మెహం చాటేశాయి. చినుకులు మరోసారి పలకరించలేదు.
అనంతపురం జిల్లాలో వర్షపాత లోటు 44 శాతానికి చేరింది. నైరుతి రుతుపవనాలు ఆగమనం తరువాత జూన్ తొలి వారంలో కురిసిన ఓ మోస్తరు వర్షం మినహా ... ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కాడా చినుకు రాలలేదు. వేరుశెనగ విత్తనం సిద్ధం చేసుకున్న రైతులు పురుగుపట్టకుండా కాపాడుకోటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతులు విత్తనంతో పాటు ఎరువులు వేయాలని అప్పులు చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేసే పనిలో వ్యవసాయశాఖ సమాయత్తమవుతోంది. ఆగస్టు తొలి వారం నుంచి అన్నదాతలకు ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదించింది. జిల్లాలోని పలు గ్రామాల్లో పశువులకు నీరు, పశుగ్రాసం లభ్యత కూడా కష్టంగా మారింది.
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
ఉదయం నుంచి విపరీతంగా ఎండ కాస్తు ఒక్కసారిగా మధ్యాహ్న సమయంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఈదురు గాలులు వేస్తూ జోరు వాన కురిసింది
Body:కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు సుమారు గంటసేపు ఏకదాటిగా వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన జోరుగా వర్షం పడడంతో వాహనాలు రోడ్డు చెంతనే నిలుపుదల చేయడంతో నిత్యం ఎంతో రద్దీగా ఉండే జాతీయ రహదారి కళా వెంకట్రావు సెంటర్ సైతం వాహనాలు తాకిడి లేక నిర్మానుష్యంగా మారాయి.
Conclusion:ఒక్కసారిగా చీకటి వాతావరణం నెలకొనడంతో వాహనచోదకులు తమ వాహనాల లైట్లు ఆన్ చేసుకుని వెళ్లారు