అనంతపురం జిల్లాలో విత్తనాల కోసం వెళ్లి రైతు మరణించిన ఘటనపై శాసన మండలిని కుదిపేసింది. రైతుల మరణాలపై తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. వ్యవసాయ మంత్రి... కుటుంబ సభ్యులు మరణించిన కారణంగా ఆయన అందుబాటులో లేరని మరోసారి దీనిపై చర్చిస్తామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సమాధానం ఇచ్చారు. రైతు చనిపోతే సభలో చర్చించరా అంటూ తెదేపా సభ్యులు నిలదీశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. గత ఐదేళ్లలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదా అంటూ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. తెదేపా పక్ష నాయకుడు యనమల జోక్యం చేసుకుని గతంలో కొన్ని సందర్భాల్లో వాయిదా తీర్మానంపై చర్చించిన విషయం గుర్తు చేశారు. అయితే ఛైర్మన్ వాయిదా తీర్మానం పై చర్చకు అనుమతించకపోవటంతో యనమల తమ సభ్యులను వెనక్కు పిలిచారు. రైతు మరణంపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని యనమల వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి