పండించిన పంటను ఇతర ప్రాంతాలకు తరలించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని లారీ యజమానులపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్‌కు రైతులు పంటను తీసుకొచ్చారు. ఇక్కడకు వచ్చిన టమాటా పంటను ఇతర ప్రాంతాలకు తరలించకుండా లారీ యజమానులు డీజిల్ ధరలు సాకుగా చూపి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.
డీజిల్ ధరలు పెరిగాయని వాహనదారులు.. తమ పంట ఎలా అమ్ముకోవాలని రైతులు.. తాము కొనుగోలు చేసిన టమాటాను ఎలా తరలించాలని వ్యాపారస్తులు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై మార్కెటింగ్ శాఖ, రవాణా శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ప్రేమించిన వ్యక్తిని కుటుంబసభ్యులు నిరాకరించారని యువతి ఆత్మహత్య