అనంతపురం జిల్లాలో విద్యుత్ బకాయిల వసూళ్లు వివాదాస్పదంగా మారాయి. గుంతకల్లు మండలం శంకరబండ గ్రామంలో విద్యుత్ బిల్లుల కోసం వెళ్లిన సిబ్బందిపై గ్రామస్థులు తిరగబడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడమే కాకుండా, ఫోన్ చేసినా స్పందించలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో బిల్లులు చెల్లించకపోతే..గ్రామం మెుత్తానికి విద్యుత్ ఎలా నిలిపివేస్తారంటూ ఉద్యోగులను నిర్బంధించారు.
రైతులు, విద్యుత్ ఉద్యోగుల వివాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. గ్రామానికి వచ్చి సిబ్బందిని విడిపించారు. తమపై దాడి చేశారంటూ ఉద్యోగులు రైతులపై కేసు పెట్టగా.... అకాల విద్యుత్ కోతలతో పంటకు నీరు పెట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు తమ వాదన వినిపించారు.
Students Problems: అక్కడ పిల్లలు.. ఇక్కడ తల్లిదండ్రులు.. ఏం జరుగుతుందోనని టెన్షన్