అప్పుల బాధ భరించలేక అనంతపురం జిల్లా పాల్తూరులో గోవిందప్ప అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటపై పెట్టిన పెట్టుబడి రాక.... అప్పులు పెరిగి మనస్థాపం చెందిన రైతు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :