ETV Bharat / state

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం... - ananthapuram district newsupdates

ధర్మవరంలో గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తుండగా.. ఆర్డీవో కార్యాలయం ఎదుటు ఓ రైతు మందు డబ్బా చేత పట్టుకొని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

Farmer commits suicide in front of Ardeo office
గణతంత్ర దినోత్సవం: ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం కలకలం
author img

By

Published : Jan 26, 2021, 3:52 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట రుక్మాంగదుడు అనే రైతు పురుగుల మందు డబ్బా చేతపట్టుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా.. ఈ ఘటన కలకలం రేపింది.

చెన్నేకొత్తపల్లి మండలం మద్దల గ్రామానికి చెందిన సాలమ్మకు 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం 5 ఎకరాల డీ పట్టా ఇచ్చింది. ఆమె కుమారుడు రుక్మాంగదుడు ఆ పొలంలో బోరు వేయించి పంటలు సాగు చేస్తున్నాడు. వీరి పొలం పక్కనే ఉన్న కన్న, వెంకటేష్ అనే ఇద్దరు రైతులు రుక్మాంగదుడు సాగు చేసుకుంటున్న భూమి తమకు వస్తుందని స్కెచ్​లో తమ భూమిగా చూపిస్తుందని ఘర్షణకు దిగారు. ఇద్దరు రైతులు చిన్న కొత్తపల్లి పోలీస్​ స్టేషన్​లో రుక్మాంగదుడు, అతని సోదరులైన మారుతి, బాలకృష్ణలపై ఫిర్యాదు చేశారు.

ఎస్​ఐ ప్రతిరోజు స్టేషన్​కు పిలిపించి బెదిరిస్తున్నాడని.. సాగు చేస్తున్న పొలం కన్న, వెంకటేష్​లకు వదిలి వేయాలని.. ఇబ్బందులు పెడుతున్నారని రుక్మాంగదుడు.. ఆర్డీవో ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. రైతు కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని వారికి ఆర్డీవో మధుసూధన్ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 18 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర పురస్కారాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.