Fake Gold Selling Gang Arrest : తక్కువ ధరకే బంగారం ఇస్తామని ఆశ చూపిస్తూ నకిలీ బంగారాన్ని అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒకరు.. మొత్తం నలుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడ్డారని హిందూపురం గ్రామీణ సీఐ హమీద్ ఖాన్ తెలిపారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి నకిలీ బంగారం అంటకట్టడమో.. నగదు దోచుకోవడమో చేస్తుంటారు. ఇదే తరహాలో హైదరాబాద్కు చెందిన కొంతమందిని తక్కువ ధరకే బంగారం వస్తుందని చెప్పి.. కంబాలపల్లికి పిలిపించారు. వారి నుంచి బలవంతగా ఆరు లక్షల రూపాయలను దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిలమత్తూరు పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మంగళవారం నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఆరు లక్షల రూపాయలు, రెండు ద్విచక్ర వాహనాలు, 10సెల్ఫోన్లు, 200 గ్రాముల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి :
AP Govt withdrawn GO No.2: జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం