అనంతపురం జిల్లాలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లోని పరిస్థితులపై మంత్రి ఆళ్ల నాని వద్ద ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రస్తావించిన తీరును అభినందించారు. కరోనా పట్ల జిల్లాలోని ప్రజలు తీవ్రమైన భయాందోళనలో ఉన్నారని చెప్పారు. కొవిడ్ ఆస్పత్రిలోనే సాధారణ రోగులను చేర్చుకోవడం సరికాదని...వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి