గండిపడే అవకాశం ఉందని ఊహించి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశామని గ్రామస్థులు తెలిపారు. స్పందించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని పేర్కొన్నారు. గండి ప్రవాహం ఇలానే కొనసాగితే రెండు, మూడు గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:వైఎస్‌ను రాజకీయ నాయకుడిగా చూడటం లేదు: రఘువీరారెడ్డి