Allu Arjun Case Dismissed : సినీ నటుడు అల్లు అర్జున్, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ అనుమతి లేకుండా నంద్యాలలో ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అల్లుఅర్జున్ తమకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు వీరిద్దరిపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అసలేం జరిగిదంటే : మే 11న అల్లు అర్జున్ నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి మద్దతుగా నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్నే రేపింది. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నంద్యాల టూటౌన్ పోలీసులు అల్లు అర్జున్ సహా శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. ఆ రోజు ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు.
అల్లు అర్జున్‌కు ఊరట - నంద్యాల కేసు క్వాష్ చేయాలని హైకోర్ట్ ఆదేశం