Repalle to Bapatla Railway Line Survey Orders were Issued with Approval : కృష్ణా జిల్లాలో కీలకమైన రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్‌కు తొలి అడుగుపడింది. 45.81 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన లైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మచిలీపట్నం-రేపల్లె మధ్య చేపట్టబోయే 45.30 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వేలైను పనులకు సంబంధించి ఎఫ్ఎల్ఎస్ (FLS) చేపట్టేందుకు ఆగస్టులో రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది.
ప్రస్తుతం దానికి అనుసంధానంగా రేపల్లె నుంచి బాపట్లకు కొత్త లైన్ వేసేందుకు తొలి అడుగుపడినట్లయింది. దీంతో దివిసీమ ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. విజయవాడతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గంగా మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల లైన్ మారబోతుంది. తీరప్రాంతంతో అత్యంత ముఖ్యమైన కోస్టల్ లైన్‌గా భవిష్యత్తులో ఇది ఉపయోగపడనుంది. మచిలీపట్నం పోర్టుకు సరకు రవాణాలో కీలక మార్గం కాబోతుంది.
ఏపీలోని ఆ మూడు రైలు మార్గాల్లో 'కవచ్' - 2027 నాటికి పూర్తి
అందరికీ సౌలభ్యం : మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ కోసం దివిసీమ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ నూతన మార్గం కోసం అనేక ఉద్యమాలు, ఆందోళనలు సైతం జరిగాయి. ఎట్టకేలకు ప్రజల కల నెరవేరబోతోంది. విజయవాడతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గంగా మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల లైన్ మారబోతోంది. తీరప్రాంతంలో అత్యంత ముఖ్యమైన కోస్టల్ లైన్‌గా ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ప్రధానంగా మచిలీపట్నం పోర్టుకు సరకు రవాణాలో కీలక మార్గం కాబోతోంది. విజయవాడ మీదుగా చుట్టూతిరిగి రావాల్సిన అవసరం లేకుండా.. నేరుగా హౌరా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంతో అనుసంధానం కావడంతో 50 నుంచి 100 కిలోమీటర్ల వరకూ దూరాభారం కూడా తగ్గబోతోంది.
రెండు సెక్షన్లుగా నూతన లైన్ : మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30 కిలోమీటర్ల లైన్‌ను ఒక సెక్షన్‌గా, రేపల్లె నుంచి బాపట్ల వరకూ 45.81 కిలోమీటర్ల లైన్ మరో సెక్షన్‌గా నూతన లైన్ ఏర్పాటు కోసం సర్వే చేపట్టి డీపీఆర్ తయారీకి రైల్వేబోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ సర్వే కోసం రూ.1.13 కోట్లు, రేపల్లె-బాపట్ల లైన్ సర్వేకు రూ.1.15 కోట్ల నిధులను రైల్వేబోర్డు తాజాగా మంజూరు చేసింది.
అమరావతికి రైలు కూత - కొత్త లైన్‌పై హర్షాతిరేకాలు - త్వరలోనే భూసేకరణ