ప్రభుత్వ పథకాలకు అర్హులైన తెదేపా సానుభూతిపరుల పేర్లను వాలంటీర్లు నమోదు చేయకుండా వేధిస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద అర్హులైన లబ్ధిదారులతో కలిసి ధర్నా చేపట్టిన ఆయన.. గ్రామాల్లో వైకాపా నాయకులు ఆదేశాల మేరకు వాలంటీర్లు పని చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపాకి చెందిన అర్హులైన నిరుపేదల వివరాలను నమోదు చేయడం లేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులు, వాలంటీర్లపై ఉందని తెలిపారు. వివక్ష ఇలాగే కొనసాగిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని రఘునాథ్‌రెడ్డి హెచ్చరించారు. అయితే అందరికీ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని ఎంపీడీవో నరేష్ కృష్ణ హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు.
ఇవీ చూడండి... : కంటెయిన్మెంట్ జోన్లో నిబంధనలు ఏవి..?