గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం పసివాడి ప్రాణాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మదన్నగారిపల్లిలోని గ్రామ పంచాయతీ బోరు బావి వద్ద పైపులకు మూడు మాసాలుగా విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన బాలాజీ (11) స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా బోరు వద్దనున్న ఇనుప పైఫులను తాకాడు. విద్యుదాఘాతానికి గురి కావటంతో బాలుడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి