ETV Bharat / state

సర్పంచి పోరులో 80 ఏళ్ల బామ్మ - anantapur updates

నాలుగో దశ పంచాయతీ ఎన్నికలలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి సొంత పంచాయతీ పరిధిలో ఆమె నామపత్రాలు దాఖలు చేశారు.

eighty years old woman filed the  nomination in local body elections at gangulavayipalem
సర్పంచి పోరులో 80 ఏళ్ల బామ్మ
author img

By

Published : Feb 11, 2021, 10:41 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో మొదటి రోజు 66 పంచాయతీలకు 98 మంది సర్పంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం నుంచి నామినేషన్లు మందకొడిగా సాగాయి. మధ్యాహ్నం నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఐదు గంటలైన నామినేషన్లు వేయడానికి వరుసలో నిల్చున్నారు. ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

సర్పంచి పోరులో 80 ఏళ్ల బామ్మ

80 ఏళ్ల బామ్మ..

మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సొంత పంచాయతైన గంగులవాయిపాలెం సర్పంచి స్థానానికి నీలకంఠపురం గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలైన ఓబమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు, సబ్ కలెక్టర్ నిశాంతి పర్యవేక్షించారు.

ఇదీ చూడండి. ఉద్ధృతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.