ETV Bharat / state

అనంతపురంలో విద్యాసంస్థల బంద్.. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట

విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో బంద్​కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఏబీవీపీ కార్యకర్తలు ఎస్పీ కార్యాలయం ముట్టడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

లాఠీ ఛార్జ్​కు నిరసనగా.. అనంతపురంలో విద్యాసంస్థల బంద్

author img

By

Published : Nov 9, 2021, 9:12 AM IST

Updated : Nov 9, 2021, 12:00 PM IST

అనంతపురంలో విద్యాసంస్థల బంద్.. పలువురు అరెస్ట్

అనంతపురం జిల్లాలో ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. ఎయిడెడ్‌ కళాశాల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆందోళన చేస్తున్న ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేయడానికి నిరసనగా విద్యార్థి సంఘాలు బంద్​కు పిలుపునిచ్చాయి. ఎస్ఎస్‌బీఎన్ కళాశాల యాజమాన్యం 2 రోజులు సెలవు ప్రకటించింది.

కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట..

ఏబీవీపీ కార్యకర్తలు ఎస్పీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. టవర్‌ క్లాక్‌ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేయబోగా.. పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను పీఎస్‌కు తరలించారు. ఈ ఘటనలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

పోలీసుల ముందస్తు అరెస్టులు..

జిల్లాలోని రాయదుర్గంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. నిన్న విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌కు నిరసనగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ దృష్ట్యా ముందుగానే రాయదుర్గంలో పోలీసులు మోహరించారు.

అసలేం జరిగింది..

ఎయిడెడ్‌ కళాశాల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థుల ఆందోళన.. వారిని అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం.. విద్యార్థుల ప్రతిఘటన.. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ఆవరణ రణరంగమైంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులు అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ (శ్రీసాయిబాబా నేషనల్‌) కళాశాల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాలను ప్రైవేటీకరించకుండా ఎయిడెడ్‌గానే కొనసాగించాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లకుండా విద్యార్థులు కళాశాల ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అడ్డుకున్నవారిని లాగిపడేశారు. జెండా కర్రలు తీసుకొని చితక్కొట్టారు. దీంతో కొందరు విద్యార్థులు గుంపులో నుంచి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో జయలక్ష్మి అనే విద్యార్థిని గాయపడింది. విద్యార్థులు ప్రతిఘటించడంతో ఆగ్రహించిన పోలీసులు వారిని చొక్కాలు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. విద్యార్థినులనూ పురుష కానిస్టేబుళ్లే పక్కకు నెట్టేశారు. ఎట్టకేలకు విద్యార్థిసంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషనుకు తరలించడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది.

విద్యార్థులపై లాఠీఛార్జి చేయలేదు

ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేయలేదని జిల్లా పోలీసు కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా ఆటంకపరుస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ విద్యార్థిని గాయపడింది. ఆమెను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు’ అని ఆ ప్రకటనలో వెల్లడించింది.

లోకేశ్‌ పరామర్శ

ఆందోళనలో గాయపడిన విద్యార్థులు జయలక్ష్మి, నవీన్‌, పవన్‌లతో తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ వీడియోకాల్‌ చేసి మాట్లాడారు. విద్యార్థుల పెడరెక్కలు విరిచి, జీపుల్లో కుక్కి లాక్కెళ్లారని గాయపడిన జయలక్ష్మి లోకేశ్‌కు వివరించింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే వరకూ తెదేపా, అనుబంధ సంఘాలు విద్యార్థులకు అండగా నిలుస్తాయన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై లాఠీఛార్జి చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. లాఠీఛార్జి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. లోకేశ్‌ బుధవారం అనంతపురం వెళ్లి పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్ధులను పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:

atp:విద్యార్థులపై విరిగిన లాఠీ...విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు

Last Updated : Nov 9, 2021, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.