ETV Bharat / state

లీకేజీలతో తాగునీరు కలుషితం..తాగాలంటేనే భయం..! - అనంతపురం జిల్లాలో తాగునీరు తాజా వార్తలు

మానవ మనుగడకు నీరు ఎంతో అవసరం. మనిషి శరీరంలో 60 శాతానికి పైగా నీరే ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతివ్యక్తి నిత్యం అయిదు లీటర్ల శుద్ధజలం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తాగునీటి విషయంలో నిర్లక్ష్యం నెలకొంది. ప్రభుత్వాలు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు పథకాల నిర్వహణను గాలికి వదిలేశారు. ఏలూరు ఘటనతోనైనా మేల్కోవాలని ప్రజలు కోరుతున్నారు.

drinking water at anantapur district
లీకేజీలతో తాగునీరు కలుషితం
author img

By

Published : Dec 13, 2020, 2:58 PM IST

తాగునీరు ప్రజలు తాగాలంటే భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో తాగునీటి పైపులకు తుప్పుపట్టండంతో..ఏం అవుతుందోనన్ని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 1,029 గ్రామ పంచాయతీలు, రెండు నగర పంచాయతీల్లో గ్రామీణ నీటి పథకాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3,312 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 52 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేశారు. సత్యసాయి, శ్రీరామిరెడ్డి, జేసీ నాగిరెడ్డి పథకాల ద్వారా సరఫరా చేస్తున్నారు. పథకాల వద్ద నీటిని శుద్ధి చేస్తున్నా.. మార్గమధ్యలో పైపుల లీకేజీలు, మురుగు కాలువల వెంబడి పైపులైన్ల ఏర్పాటుతో కలుషితమవుతున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

తుప్ఫు ముప్పు

పలు పట్టణాలు, గ్రామాల్లోని తాగునీటి పైపులు తుప్పు పట్టాయి. తుప్పు పట్టిన పైపుల నుంచి సీసం తాగునీటిలో కలిసే అవకాశం ఉంది. సీసం కలిసిన నీటిని తాగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కోసారి క్యాన్సర్‌కు దారి తీయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

కాచి చల్లార్చిన నీటినే తాగండి

కలుషిత నీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కలరా, టైఫాయిడ్‌, కామెర్లు వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. తుప్పు పట్టిన పైపుల కారణంగా నీటిలో సీసం చేరుతుంది. దీనివల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రజలు ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ఉత్తమం.

-అరాఫత్‌, వైద్యులు, సర్వజనాసుపత్రి

ఏం చేయాలి

ప్రైవేటు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్వాహకులు తరచూ పరీక్షలు చేయించాలి. నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసిన తర్వాత అవసరమైన ఖనిజాలను కలపాలి. భారత నాణ్యత ప్రమాణాల నిర్ధరణ సంస్థ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఎలాంటి రసాయనాలను కలపకూడదు. ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పరీక్షించాలి. నెలకోసారి అధికారులు నీటి పరీక్షలు చేసి ధ్రువపత్రాలు జారీ చేయాలి. ప్యాకింగ్‌ ఉన్నచోట ఐఎస్‌ఐ ముద్ర తప్పనిసరి.

ఏం చేస్తున్నారు

జిల్లాలో ప్రైవేటు నీటి శుద్ధి ప్లాంట్లను పర్యవేక్షించడానికి అధికారులెవరూ లేరు. కనీసం ఎన్ని ప్లాంట్లు ఉన్నాయో లెక్కలు చెప్పే వారే కరవయ్యారు. దీంతో నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. పలు ప్లాంట్లలో ఏళ్లుగా నీటి పరీక్షలు చేయించడం లేదు. తగినంత మోతాదులో ఖనిజాలను కలపడం లేదు. ప్రయోగశాలలు లేవు.

మురుగుతో జతగా..

ధర్మవరం పట్టణంలో 1,30,000 జనాభా ఉంది. ఇక్కడ 13 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, 24,156 కొళాయిల నిత్యం కోటి 70 లక్షల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నారు. చిత్రావతి నది నుంచి సుమారు 40 కి.మీ. పైపులైను ఏర్పాటు చేసి, పట్టణ సమీపాన శుద్ధి చేసి ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నింపుతున్నారు. శుద్ధి కేంద్రం నుంచి పట్టణంలోకి వచ్చే పైపులైను పలుచోట్ల మురుగు కాలువ గుండా వస్తోంది. ఏమాత్రం లీకేజీ ఏర్పడినా కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

భూగర్భ జలం.. కలుషితం

తాడిపత్రిలోని 1,20,000 జనాభాకు 6 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, 15,500 కొళాయిల ద్వారా రోజుకు 80 లక్షల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పెన్నానదిలో 27 బోర్లు వేశారు. అక్కడి నుంచే 60 శాతం తాగునీటిని వాడుకుంటున్నారు. నదిలో బోర్లున్న ప్రాంతంలోనే పెద్ద ఎత్తున డ్రైనేజీ నీరు చేరుతోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.

లీకేజీల సమస్య

గుంతకల్లులోని 1,50,000 జనాభాకు 15 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, 30,000 కొళాయిల ద్వారా నిత్యం కోటి 20 లక్షల లీటర్ల తాగునీటిని గుత్తి బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి సరఫరా చేస్తున్నారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల వరకు పైపులైన్లు బాగానే ఉన్నా.. అక్కడి నుంచి కాలనీల్లోని కొళాయిలకు వచ్చే పైపులు చాలాచోట్ల మురుగు కాలువల గుండా ఏర్పాటు చేశారు. తరచూ లీకేజీల కారణంగా తాగునీరు కలుషితమవుతోంది.

ఆరోగ్యానికి ముప్పు

పుట్టపర్తిలోని 35 వేల జనాభాకు 5 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, 5,600 కొళాయిల ద్వారా రోజూ 23 లక్షల లీటర్ల తాగునీటిని సత్యసాయి పథకం, చిత్రావతి నదిలోని బోర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని డ్రైనేజీ నీరంతా చిత్రావతిలో కలుస్తుండటంతో జలాలు కలుషితమవుతున్నాయి. అక్కడి బోర్ల నుంచి వచ్చే నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి.

అకస్మాత్తుగా స్పృహ కోల్పోతున్న నడికుడి కాలనీవాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.