ETV Bharat / state

గాడిదలను దొంగిలించబోయారు.. చివరకు దొరికి పోయారు.. - అనంతపురం జిల్లా తాజా వార్తలు

మాంసం కోసమో.., విక్రయించి సొమ్ము చేసుకోవడానికో ఆవుల్ని కానీ, గేదెల్ని కానీ చోరీ చేయడం చూసి ఉంటాం... కానీ గాడిదల్ని దొంగతనం చేయడం చూశారా..! నిజమండి. రాత్రికి రాత్రే గ్రామంలోని గాడిదల్ని తరలించేద్దామని ప్లాన్ వేశారు.. కానీ.. అది బెడిసికొట్టింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Donkey robbers are arrested at mopidi village, ananthapur district
అనంతపురం జిల్లా మోపిడిలో గాడిద దొంగలు హల్​చల్
author img

By

Published : Jul 2, 2020, 6:33 PM IST

Updated : Jul 2, 2020, 7:13 PM IST

ప్రకాశం జిల్లా చీరాల, బాపట్లకు చెందిన నలుగురు... గాడిద దొంగలు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో హల్​చల్​ చేశారు. బుధవారం రాత్రి మోపిడి గ్రామంలో ఉన్న గాడిదలను టాటా ఏసీలో... ఎక్కించి వాటిని ఉరి బయట తీసుకెళ్లి తాళ్లతో కట్టేశారు. మరి కొన్ని గాడిదలను దొంగలించడానికి తిరిగి గ్రామానికి వచ్చారు. ఇంతలో వారిని స్థానికులు గమనించారు. వాహనంలోకి గాడిదలను ఎక్కించే సమయంలో రెడ్​హ్యాండెడ్​గా పట్టుకొని... కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాడిద దొంగలను పోలీస్ స్టేషన్​కు తరలించి కేసు నమోదు చేశారు. దొంగతనంగా తరలించిన గాడిదలను పట్టణాలకు తీసుకువెళ్లి మాంసం కోసం విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారు.

ఇదీ చదవండి: తొలిగించేప్పుడు నిర్లక్ష్యం వహిస్తే అంతే..

Last Updated : Jul 2, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.