సహజంగా కుక్క, వరాహనికి వైరం ఉంటుంది. పంది కనిపించిందంటే..దాడికి ఎగబడతాయి కుక్కలు. దీనికి విరుద్ధంగా వరాహనికి, శునకం పాలు ఇస్తోంది. అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఈ దృశ్యం కనిపించింది. ఆ శునకం కొన్ని రోజులుగా వరాహనికి పాలు ఇచ్చి ఆకలి తీరుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటంతో వైరల్గా మారాయి.
ఇదీ చదవండీ.. WEATHER ALERT: అల్పపీడన ప్రభావం.. రాగల మూడు రోజుల్లో వర్షాలు